నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం బాధ్యత వహించాలి.
విద్యార్థులపై లాఠీచార్జీలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం
-డీసీసీ అధికార ప్రతినిధి డా. నరేందర్ పవార్
హైదరాబాద్, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు):
నీట్ పేపర్ లీకేజీతో దేశ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డీసీసీ అధికార ప్రతినిధి, ఓయూ తెలంగాణ ఉద్యమకారుడు డా. నరేందర్ పవార్ డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీకేజీపై సమాధానాలు కోరిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాకుండా, వారి ఆందోళనలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తిని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించిన ఆయన, రాజ్యాంగ విలువలు, విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో యువత శాంతియుత పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పూర్తి బాధ్యత వహించి పారదర్శక చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని డా. నరేందర్ పవార్ పేర్కొన్నారు.


Comments