ఉమ్మడి జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం.

ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు.

ఉమ్మడి జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం.

హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ):

ఉమ్మడి కరీంనగర్–వరంగల్ జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్‌ను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సొల్లు సారయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రీ.శే. సమ్మయ్య (రణధీర్) సీఐ, క్రీ.శే. జి. మల్లయ్య, క్రీ.శే. జి. మూర్తి, క్రీ.శే. జి. బాలరాజ్ స్మారకార్థం ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు.
టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కబడ్డీ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదని, ప్రతి క్రీడాకారుడిలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే గొప్ప క్రీడ అని అన్నారు. గెలుపు–ఓటములు క్రీడల్లో సహజమని, వాటిని సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు.
ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న 48 జట్లకు ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతిభను చాటుకుని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇటువంటి క్రీడా పోటీలు యువతలో ఆరోగ్యకరమైన జీవన విధానంతో పాటు ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

IMG-20260711-WA0023

ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, హెచ్‌ఎం శోభారాణి, వైస్ చైర్‌పర్సన్ అంజలి, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, జిల్లా, మండల కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, పీడీలు, పీఈటీలు, టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు.
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...
భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ విరాళం.
ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు.
ఉమ్మడి జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం.
హుజురాబాద్‌లో పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం.
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ అభిమానుల విజ్ఞప్తి.
ఘనంగా చిల్డ్రన్స్ పార్లమెంట్ వార్షిక దినోత్సవం.