వెల్టూర్ ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా చింతల వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక.

వెల్టూర్ ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా చింతల వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక.

పెద్దమందడి,జూలై07(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పరిధిలోని వెల్టూర్ ఉన్ని చేనేత పరిశ్రమ సహకార సంఘం అధ్యక్షులుగా చింతల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సంఘం పాలకవర్గ కమిటీని కూడా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా మూలమల్ల బీరయ్య, కార్యదర్శిగా ఎల్లన్న, కోశాధికారిగా వెంకటయ్య, డైరెక్టర్లుగా నరసింహ, ఎర్ర మల్లయ్య, మూలమల్ల రాములు, చింతల సరిత, సాంబ మల్లమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం చింతల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ చేనేత కార్మికుల సంక్షేమం, సహకార సంఘ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానన్నారు. చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.అలాగే గతంలో డీసీసీబీ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవాన్ని చేనేత రంగ అభివృద్ధికి వినియోగిస్తానని పేర్కొన్నారు. టెస్కో రాష్ట్రస్థాయి డైరెక్టర్ పదవికి అవసరమైన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని, అవకాశం కల్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .