సమ్మక్క గద్దెలకు హరిత శోభ.. పండ్ల మొక్కలతో పచ్చధానానికి శ్రీకారం.

సమ్మక్క గద్దెలకు హరిత శోభ.. పండ్ల మొక్కలతో పచ్చధానానికి శ్రీకారం.

జమ్మికుంట టౌన్ జూలై 06 (తెలంగాణ ముచ్చట్లు):

వనమహోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని కేశవాపురం సమ్మక్క గద్దెల పరిసర ప్రాంతంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమ్మక్క గద్దెల పరిసరాల్లో ఉన్న విశాలమైన ప్రభుత్వ స్థలాలను పచ్చదనంతో నింపే లక్ష్యంతో అల్లనేరేడు, జామ తదితర పండ్ల మొక్కలను నాటుతున్నామని తెలిపారు. పండ్ల మొక్కలు పెరగడం వల్ల పక్షులు, ఇతర మూగజీవాలకు ఆహారం లభించడంతో పాటు కోతులు మానవ నివాస ప్రాంతాల్లోకి వచ్చే పరిస్థితి కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.
దుబ్బ మల్లన్న ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలోని ఇతర ప్రభుత్వ స్థలాల్లోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. "తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి" అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పాతకాల మౌనిక అనిల్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, ఆర్‌పీ స్వరూప, అంగన్‌వాడీ టీచర్ శివభారతి, ఆశా వర్కర్ స్వప్నతో IMG-20260706-WA0031పాటు రమేష్, సతీష్, సురేష్, అంజి, కమలాకర్, అజయ్, సాయికిరణ్, నందు, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .