విద్యుత్ భద్రతపై అప్రమత్తతే రక్షణ.

*రైతులు, వినియోగదారులకు డీఈ ఉపేందర్ కీలక సూచనలు.

హుజూరాబాద్,జూన్ 30(తెలంగాణ ముచ్చట్లు ):

విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కరీంనగర్ డీఈ (టెక్నికల్ అండ్ సేఫ్టీ) ఉపేందర్ సూచించారు. హుజూరాబాద్ టౌన్ పోలీస్ పరిధిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే టీజీఎస్‌పీడీసీఎల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
విద్యుత్ శాఖ ప్రవేశపెట్టిన 'న్యూ మీటర్ స్కీమ్' వినియోగదారులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు స్వయంగా విద్యుత్ స్తంభాలు మార్చే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపాలు తలెత్తిన వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
అనవసర విద్యుత్ లోడ్లను వినియోగించకుండా, నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని రైతులకు సూచించారు. విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడంతో పాటు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .