అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేసిన సర్పంచ్ మంజుల.
Views: 1
On
పెద్దమందడి,జూన్24( తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని మొదటి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.ఈ సందర్భంగా విద్యార్థులు క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు హాజరై విద్యతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా అంగన్వాడీ సిబ్బంది సమయపాలన పాటిస్తూ కేంద్రాలను నిర్వహించాలని, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సకాలంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్రవంతి, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, బాలబాలికలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments