జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
Views: 0
On
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.ఎంఎల్‌సీ, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మెఘారెడ్డి చేతుల మీదుగా కురుమయ్యకు ఉత్తమ ఉద్యోగి అవార్డును ప్రదానం చేశారు. విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, ఉత్తమ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవడం పట్ల కురుమయ్యను పలువురు అధికారులు, సహచర ఉద్యోగులు, సిబ్బంది అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments