వేలేరులో సైడ్ డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం.

వేలేరులో సైడ్ డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం.

వేలేరు, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సైడ్ డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వేలేరు గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో వేలేరు ప్రధాన రహదారి వెంట సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టడంతో పాటు, మిగిలి ఉన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి విజయ, వార్డు సభ్యులు సురేష్, సునీల్, గ్రామ పెద్దలు పురుషోత్తం, రాజయ్య, రంగం, రాజు, లక్ష్మీనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా...
ప్రభుత్వానికి రూ.2.42 కోట్ల నష్టం.. రైస్ మిల్ యజమాని అరెస్ట్.
పోచమ్మ తల్లి ఆలయంలో బోరుబావికి శ్రీకారం.
పేదల సంక్షేమ పథకాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం.
విద్యారంగ సమస్యలపై యూఎస్పీసీ సమరభేరి.
సత్తుపల్లిలో 6.36 కిలోల గంజాయి పట్టివేత.
IIIT సీటు సాధించిన హాసినికి సర్పంచ్ ఆర్థిక సాయం.