క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలి.
అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ సూచన.
వనపర్తి,ఆగస్టు12(తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ సూచించారు. వనపర్తి పట్టణంలోని బండార్‌నగర్ ఎంపీపీఎస్ పాఠశాలను బుధవారం సందర్శించిన ఆమె విద్యార్థులకు ఉచిత పాఠశాల యూనిఫార్మ్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన ఆమె.. ప్రతిరోజూ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ.. అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. వంటశాలలో పరిశుభ్రత, హైజీన్‌తో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, వార్డు కౌన్సిలర్ శిరీష రమేష్‌గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మున్సిపల్, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments