బెన్నూరు ఆశన్నకు ఘనంగా సన్మానం.
ఖిల్లా ఘనపురం,ఆగస్టు09(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నూతనంగా నియమితులైన బెన్నూరు ఆశన్నను బీజేపీ రాష్ట్ర నాయకులు అశ్విని నందకుమార్, ఘనపురం బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు.ఇటీవల బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బెన్నూరు ఆశన్న నియమితులైన సందర్భంగా మండల కేంద్రంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.బీజేపీలో ఓబీసీ మోర్చా బలోపేతానికి కృషి చేస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత చురుగ్గా పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి బెన్నూరు ఆశన్న కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఘనపురం సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments