సిరిపాటి వేణుకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి.
బేడ బుడగ జంగం జనసంఘం డిమాండ్.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 04 (తెలంగాణ ముచ్చట్లు):
బేడ బుడగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణుకు తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి కల్పించాలని బేడ బుడగ జంగం సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. జమ్మికుంటలో తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తూర్పాటి లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు జిల్లా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బేడ బుడగ జంగం సమాజ హక్కుల సాధన, సామాజిక న్యాయం, ప్రత్యేక గుర్తింపు కోసం సిరిపాటి వేణు రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ సమాజ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో సమాజానికి ప్రత్యేక ఉపవర్గ గుర్తింపు కల్పించాలనే డిమాండ్‌తో జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలు, వినతిపత్రాల సమర్పణ చేపట్టారని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ గృహాలు, బేడ బుడగ జంగం ఆత్మగౌరవ భవనం నిర్మాణం, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై ఆయన నిరంతరం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని వివరించారు. సమాజ అభ్యున్నతికి చేసిన సేవలను గుర్తించి సిరిపాటి వేణుకు తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో తూర్పాటి శంకర్, మోతే గంగయ్య, రుద్రాక్ష పోచయ్య, పర్వత మల్లయ్య, తూర్పాటి సమ్మయ్య, తూర్పాటి జంపయ్య, తూర్పాటి సాయిలు, తూర్పాటి సారయ్య, పస్తం సమ్మయ్య, కొండపల్లి రవి, వానరాశి వెంకటయ్య, తూర్పాటి రాజు, మోతే రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments