వెల్టూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల క్షేత్రస్థాయి పర్యటన.

వెల్టూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల క్షేత్రస్థాయి పర్యటన.

పెద్దమందడి,ఆగస్టు01(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ కాలనీ, ఓల్డ్ ఎస్సీ కాలనీ, కుమ్మరి గేరి ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు.పర్యటనలో భాగంగా ఆయా కాలనీల్లో శిథిలావస్థకు చేరిన పాడుబడిన ఇళ్లను గుర్తించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను మూడు రోజులలోగా తొలగించాలని సంబంధిత యజమానులకు సూచించారు.ఓల్డ్ ఎస్సీ కాలనీలో సర్కార్ తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు అధికంగా పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని స్థానికులు సర్పంచ్, వార్డు సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వారు వీలైనంత త్వరగా జేసీబీ సహాయంతో పిచ్చి మొక్కలు, సర్కార్ తుమ్మ చెట్లను తొలగించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యాలను, మౌలిక వసతులను పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, వార్డు సభ్యులతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి కూడా పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

*అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. *అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
* ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు.. ఇంటర్ అర్హత కలిగిన స్థానిక మహిళలకు అవకాశం జమ్మికుంట టౌన్ ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):...
అర్హులైన ప్రతి ఓటరే లక్ష్యం.. క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన.
వీణవంకలో 'సర్' ఫారాల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తి.
దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల్లో మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.
సత్తుపల్లిలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
ఫీల్డ్ అసిస్టెంట్లకు నిరసన కార్యక్రమాలతో సంబంధం లేదు.
వెల్టూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల క్షేత్రస్థాయి పర్యటన.