తీజ్ పండుగకు ప్రభుత్వ సెలవు ప్రకటించాలి.

ఆగస్టు 18 నుంచి 27 వరకు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలి.

తీజ్ పండుగకు ప్రభుత్వ సెలవు ప్రకటించాలి.

గోర్ సేన,గోర్ సిక్వాడి డిమాండ్ 

హనుమకొండ, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు)

గోర్ సిక్వాడి, గోర్ సేన భారత్, తెలంగాణ కమిటీల పిలుపు మేరకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన అధ్యక్షుడు మాలోతు చిట్టిబాబు నాయక్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బంజారా సమాజానికి చెందిన ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం తీజ్ పండుగను తండాలు, గ్రామాలు, పట్టణాల్లో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. తీజ్ పండుగ రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు.గోర్ సిక్వాడి మీడియా విభాగం అధ్యక్షుడు బాదావత్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆగస్టు 18 నుంచి 27 వరకు పది రోజులపాటు తీజ్ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తీజ్ పండుగ సింధు నాగరికతకు పూర్వం నుంచే బంజారా సమాజ వారసత్వ సంపదగా కొనసాగుతోందని పేర్కొన్నారు.తొమ్మిది రోజులపాటు పెళ్లికాని యువతులు గోధుమ మొక్కలకు నీరు పోస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, గోధుమ గడ్డి ఏపుగా పెరిగితే పంటలు కూడా సమృద్ధిగా పండుతాయని విశ్వసిస్తారని వివరించారు. చివరి రోజున సేవాలాల్ మహారాజ్‌కు భోగ్ కార్యక్రమం నిర్వహించి, మేరమా యాడికి ప్రత్యేక పూజలు చేసి తీజ్ నిమజ్జనం చేపడతామని తెలిపారు.

తీజ్ ఉత్సవాల కార్యక్రమాలు

ఆగస్టు 18: ఘంవ్ గలేరో – గోధుమ గింజల శుద్ధి
ఆగస్టు 19: తీజ్ బోయెరో – గోధుమ గింజల విత్తనం
ఆగస్టు 20: బోరడి తీజ్
ఆగస్టు 21: గోర్ బంజారా చరిత్ర, మహా యోధులు, సంస్కృతిపై ప్రసంగాలు
ఆగస్టు 22: బంజారా సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలు, నృత్యాలు, జానపద ఆటలు
ఆగస్టు 23: సాంస్కృతిక కార్యక్రమాలు
ఆగస్టు 24: సాంస్కృతిక, జానపద ప్రదర్శనలు
ఆగస్టు 25: ఢమోళి – పూజలు, ప్రసంగాలు
ఆగస్టు 26: ఘణ గోర్ తీజ్ – పూజలు, వ్రతాలు
ఆగస్టు 27: తీజ్ వెంటారా, కడవ పూజ, సేవాలాల్ భోగ్, మేరమా యాడి పూజ, తీజ్ నిమజ్జనం

ఈ సమావేశంలో రాష్ట్రీయ గోర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు సబావట్ మహేందర్ నాయక్, భూక్య రవి నాయక్, చంద్రు తండా సర్పంచ్ విజయ్ నాయక్, దేవేందర్ నాయక్, వెంకన్న నాయక్, శ్రీధర్ నాయక్, నాగమణి బాయి, సోనా బాయి, అనూష బాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News