ఓటు హక్కు పరిరక్షణలో బీఎల్‌ఏలు చురుగ్గా వ్యవహరించాలి.

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

ఓటు హక్కు పరిరక్షణలో బీఎల్‌ఏలు చురుగ్గా వ్యవహరించాలి.

పెద్దమందడి,జూలై21తెలంగాణ ముచ్చట్లు): 

ఓటు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని, దానిని పరిరక్షించడంలో బీఎల్‌ఏలు చురుగ్గా వ్యవహరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లి, గట్లఖానాపూర్ గ్రామాల్లో జరుగుతున్న ప్రక్రియను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ప్రతి అర్హ ఓటరును ప్రత్యక్షంగా కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు అయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించేలా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేలా చైతన్యం కల్పించడం బీఎల్‌ఏల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్లకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు మాణిక్యం, రఘువర్ధన్ రెడ్డి, మాధవ రెడ్డి, రవిప్రకాశ్ రెడ్డి, డేగ మహేశ్వర్ రెడ్డి, నరేష్, చిట్యాల రాము, జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, లక్ష్మణ్ గౌడ్, శంకర్ నాయక్, రమేష్ హనుమంతు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News