హుస్నాబాద్ మహాధర్నాలో ఎల్కతుర్తి బీజేపీ నేతల అరెస్ట్.

హుస్నాబాద్ మహాధర్నాలో ఎల్కతుర్తి బీజేపీ నేతల అరెస్ట్.

ఎల్కతుర్తి, జూలై 22 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ధర్నా సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఎల్కతుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ ఆధ్వర్యంలోని మండల నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి పైడిపల్లి పృద్విరాజ్‌తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News