కొరపల్లిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు.
జమ్మికుంట టౌన్ జులై 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరంనేని పరుశరామ్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ప్రజాసేవను, సంక్షేమ పాలనను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న, గిరవేన శ్రీనివాస్ యాదవ్, దొగ్గల భాస్కర్, పింగిలి రాకేష్, పింగిలి రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడిగ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ రాచపల్లి సాగర్, బిజిగిరి శ్రీకాంత్, కొరపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు పోల్సాని సాగర్ రావు, కొండు బిక్షపతి, బండారి శ్రీధర్, పుల్లూరు రవి, మేకల కొమరయ్య, కనకం కుమార్, పుల్లూరు సంపత్, పుల్లూరి సమ్మయ్య, కుమార్, రామచంద్ర, సమ్మయ్య, మహేష్‌తో పాటు జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments