ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.60 లక్షల బీమా.. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.

జిల్లా అధ్యక్షులు భరత్, జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ సాగర్ .

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.60 లక్షల బీమా.. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.

వనపర్తి,జూన్26(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.60 లక్షల జీవిత బీమా పథకాన్ని రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయడాన్ని వనపర్తి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భరత్, జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ సాగర్ శుక్రవారం ఒక ప్రకటనలో  హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, స్థానిక సంస్థల్లో వేలాదిమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలందిస్తున్నారని తెలిపారు. వారికి కూడా రూ.60 లక్షల వరకు బీమా రక్షణ కల్పించడం ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.గతంలో ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరంగా ఉండేవారని, ప్రస్తుతం ప్రభుత్వం వారినీ ఈ బీమా పథకం పరిధిలోకి తీసుకురావడం అభినందనీయమైన నిర్ణయమని అన్నారు.అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, కార్పొరేషన్ లేదా ప్రభుత్వమే నేరుగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమానికి మరింత దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.IMG-20260626-WA0067

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .