జిఎం కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
మంచిర్యాల, ఆగస్టు 15, (తెలంగాణ ముచ్చట్లు)
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జియం రాధాకృష్ణ హాజరయ్యారు, కార్యక్రమంలో భాగంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు, ఈ సందర్భంగా జిఎం రాధాకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులకు, అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు, మహిళా సిబ్బందికి మరియు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు, దక్షిణ భారతదేశంలో వెలుగులు నింపుతున్న సింగరేణి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు, అంతేకాకుండా డైవర్సిఫికేషన్ ప్రక్రియలో భాగంగా సింగరేణి విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి కూడా విజయవంతంగా అడుగుపెట్టిందని తెలిపారు,సిఎండి మరియు డైరెక్టర్ల మార్గదర్శకత్వంలో అందరి సమిష్టి కృషితో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తే సింగరేణిని దేశంలోనే నంబర్ వన్ సంస్థగా నిలబెట్టవచ్చని పిలుపునిచ్చారు, రాబోయే రోజులలో రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ (ఫేజ్-2) ను ప్రారంభించబోతున్నామని తెలిపారు, కార్యక్రమంలో భాగంగా మందమర్రి ఏరియాలోని వివిధ గనులు, డిపార్ట్‌మెంట్లలో ప్రతిభ కనబరిచిన 11 మంది ఉత్తమ ఉద్యోగులకు జిఎం చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జియం ప్రసాద్, ఏఐటియూసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, సిఎమ్‌ఓఏఐ అధ్యక్షులు ఎస్. రమేష్, డిజిఎం పర్సనల్ సిహెచ్. అశోక్, ఏరియా ఉన్నతాధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.


Comments