ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమానికి ఏసీపీ వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రామలింగారెడ్డి, డీఐ రవికుమార్, ట్రాఫిక్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ చిరంజీవి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశ ప్రజలందరూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల సేవలు అభినందనీయమని పేర్కొన్న అధికారులు, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గ్యారంపల్లి శివాజీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు పారేల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఏవి శ్రీధర్ రావు, కూకుట్ల నరోత్తం రెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, సంయుక్త కార్యదర్శి దాస రాజు, సీనియర్ పాత్రికేయులు దొంతుల వెంకటరామిరెడ్డి, కొలనుపాక చంద్రమౌళి, పల్లా మహేందర్ రెడ్డి, మండవ శ్రీశైలం, కోడికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments