ఉత్తమ పోలీస్ సేవలు.. దామోదర్‌కు ప్రశంసా పత్రం.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న దామోదర్ పోలీస్ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం అందుకున్నారు.విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పాటు ఉత్తమ సేవలు అందించినందుకు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి దామోదర్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమని, ఇటువంటి ప్రశంసలు సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడతాయని అన్నారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ దామోదర్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ గుర్తింపు తనలో మరింత బాధ్యత, ఉత్సాహాన్ని పెంచిందని, భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా దామోదర్ ను పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది అభినందించారు.


Comments