నేటి బాలలే రేపటి పౌరులు ఘనంగా గణతంత్ర దినోత్సవం.
కృష్ణవేణి హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
జవహర్‌నగర్, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు):
జవహర్‌నగర్‌లోని జన్మభూమి నగర్, ప్రగతి నగర్ పరిధిలో ఉన్న కృష్ణవేణి హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కల్పన జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
కరస్పాండెంట్ కల్పన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరస్పాండెంట్ కల్పన సహకారంతో సీనియర్ ఉపాధ్యాయురాలు చింతల స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మెరుగు శివకృష్ణ, జవహర్‌నగర్ పూసల సంఘం అధ్యక్షులు మధ్యబోయిన రాజు, బలగం టీవీ సీఈవో చింతల విజయ్‌కుమార్, స్టార్ న్యూస్ టీవీ9 రఘ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తిని ప్రతిబింబించేలా ఆకట్టుకునే నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సందేశాలతో అలరించారు. చిన్నారుల దేశభక్తి నినాదాలతో పాఠశాల ప్రాంగణం మార్మోగింది.
దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ, వారి ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని ముఖ్య అతిథులు సూచించారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించాలని ఉపాధ్యాయురాలు చింతల స్వప్న అన్నారు. దేశంపై గౌరవం, బాధ్యత, ఐక్యత భావాలను విద్యార్థుల్లో పెంచడంలో పాఠశాలలు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజాత, లావణ్య, బ్లెస్సీ జెరుష, రమణమ్మ, నాగమనమ్మ తదితరులు పాల్గొన్నారు.


Comments