పట్టపగలు వెలుగుతున్న వీధి లైట్లు.. పట్టించుకోని అధికారులు.

పట్టపగలు వెలుగుతున్న వీధి లైట్లు.. పట్టించుకోని అధికారులు.

వేలేరు, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంతో పాటు పీచర, లోక్యాతండా గ్రామాల్లో పట్టపగలు కూడా వీధి లైట్లు వెలుగుతుండటంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో వీధి లైట్లు నిరంతరాయంగా వెలుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, సిబ్బంది వాటిని నిలిపివేయడానికి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
వీధి లైట్లు పగటి సమయంలో వెలగడం వల్ల విద్యుత్ శక్తి వృథా కావడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం పడుతోందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామాల్లో విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు ఇలాంటి సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి పగటి సమయంలో వీధి లైట్లు వెలగకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ వృథాను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .