సత్తుపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటిన కాంగ్రెస్ నాయకులు.
సత్తుపల్లి, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు):
పట్టణంలోని శ్రీ సర్దార్ జలగం వెంగళరావు మున్సిపాలిటీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకుంటూ దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణకాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


Comments