విద్యారంగ సమస్యలపై యూఎస్పీసీ సమరభేరి.
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన యూఎస్పీసీ నాయకులు.
స్పందించకుంటే సెప్టెంబర్‌లో చలో అసెంబ్లీ
భీమదేవరపల్లి, ఆగస్టు 14(తెలంగాణ ముచ్చట్లు):
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) రాష్ట్ర నాయకులు అటుకుల శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపునిచ్చిన నాలుగు దశల పోరాటంలో భాగంగా మండల తహసీల్దార్ రాజేష్‌కు ముఖ్యమంత్రి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి దశలో భాగంగా ఈనెల 7వ తేదీన అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ డోరి రమేష్, టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్.రాజేంద్రం, డీటీఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు దాసరి రవీందర్, మాడుగుల నవీన్ కుమార్, టీపీటీఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఆర్.భిక్షపతి, కె.కొమురయ్య, యూటీఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.సమ్మయ్య, జి.ప్రదీప్ కుమార్, పీఈటీ అసోసియేషన్ మండల అధ్యక్షులు ఎ.మోహన్, సీనియర్ నాయకులు ఎన్.భాస్కర్ రెడ్డి, బి.ఉమాదేవి, జి.రమణారెడ్డి, వెంకటేశ్వర్లు, స్టాలిన్, రాజానాయక్, వి.సతీష్, కామారపు శ్రీనివాస్, బి.అశోక్ కుమార్, ఎం.విజయకుమార్, పి.లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments