మెరుగు శివకృష్ణ చొరవతో దివ్యాంగుడికి కృత్రిమ కాలు అందజేత.

మెరుగు శివకృష్ణ చొరవతో దివ్యాంగుడికి కృత్రిమ కాలు అందజేత.

దేవుళ్లు ఎకోడో ఉండరు ఇలాంటి సేవమూర్తులు మధ్యలోనే ఉంటారు

కూకట్‌పల్లి, ఆగస్టు 12 (తెలంగాణ ముచ్చట్లు):

గజ్వేల్‌కు చెందిన సాయిలు ప్రమాదంలో తన ఎడమ కాలును కోల్పోయి చాలా కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీ పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బందులు పడుతున్న ఆయన పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ వెంటనే స్పందించారు.
సాయిలుకు అవసరమైన సహాయం అందించేందుకు భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసతి కేంద్రం ట్రస్ట్ను సంప్రదించి, కృత్రిమ కాలు అందేలా చర్యలు చేపట్టారు. మెరుగు శివకృష్ణ చొరవతో సాయిలుకు కృత్రిమ కాలు అందడంతో ఆయన జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. ఇకపై రోజువారీ పనులను మరింత సులభంగా నిర్వహించుకునే అవకాశం లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూ శక్తి దివ్యాంగుల సంస్థ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు వేల్పుగొండ వెంకటస్వామి హాజరయ్యారు. శాంతి వికలాంగుల సంఘానికి చెందిన గంటి భ్రమరాంబతో పాటు భారత్ వికాస్ ట్రస్ట్ మేనేజర్ నరేంద్ర, టెక్నీషియన్లు రఘు, మధు, స్వామి, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఇంకా అనేక మంది దివ్యాంగులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులకు విద్య, ఉపాధి, వైద్యం, వివాహం వంటి అంశాల్లో ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన భారత్ వికాస్ ట్రస్ట్‌కు దివ్యాంగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి దివ్యాంగుడికి అండగా నిలవడం మనందరి సామాజిక బాధ్యత అని మెరుగు శివకృష్ణ పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News