నేడు అమ్మపల్లికి ఎమ్మెల్యే రాక.

అమ్మపల్లి  సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర్ రెడ్డి .

నేడు అమ్మపల్లికి ఎమ్మెల్యే రాక.

పెద్దమందడి,ఆగస్టు12(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి నేడు రానున్నారు. ఉదయం 9 గంటలకు నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు అమ్మపల్లి గ్రామ సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. అలాగే మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర్ రెడ్డి కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News