రైతుకు నీళ్లు ఇస్తే స్వాగతిస్తాం.. ఇవ్వకపోతే ఉద్యమిస్తాం.

రైతుకు నీళ్లు ఇస్తే స్వాగతిస్తాం.. ఇవ్వకపోతే ఉద్యమిస్తాం.

బీఆర్‌ఎస్ పోరాటంతోనే కాంగ్రెస్  మేల్కొంది

-- అల్వాల వెంకటరెడ్డి, పెద్దమందడి బీఆర్ఎస్ నాయకులు

పెద్దమందడి,ఆగస్టు10(తెలంగాణ ముచ్చట్లు):

రైతులకు సాగునీరు అందించాలన్న బీఆర్‌ఎస్ పోరాటం, హెచ్చరికలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రస్తుతం నీటిని విడుదల చేసిందని వనపర్తి జిల్లా పెద్దమందడి బీఆర్‌ఎస్ నాయకుడు అల్వాల వెంకటరెడ్డి అన్నారు. రైతులకు సాగునీరు అందించడం మంచి పరిణామమని, దీనిని బీఆర్‌ఎస్ స్వాగతిస్తుందని స్పష్టం చేశారు.వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత బీఆర్‌ఎస్ రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఇప్పుడు సాగునీరు విడుదల చేశారని ఆయన అన్నారు. నీటిని విడుదల చేసిన విషయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ముందుగానే రైతుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత అధికార పార్టీపై లేదా అని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.బీఆర్‌ఎస్ పోరాటం చేసిన తర్వాతే ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయడం చూస్తుంటే రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని విమర్శించారు. సాగునీరు విడుదల చేసిన అనంతరం కాంగ్రెస్ నాయకులు ఫోటోలకు ఫోజులిస్తూ తామేదో ఘనకార్యం సాధించినట్లు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.నీళ్లు వదిలాం.. ఇదిగో ఫోటోలు చూడండి అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకోవడం కాదని, విడుదల చేసిన నీరు నిజంగా రైతుల పొలాలకు చేరిందా లేదా అనేదే ముఖ్యమని అల్వాల వెంకటరెడ్డి అన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్‌ను పక్కదారి పట్టించే పార్టీగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఖండించారు. రైతుల సాగునీటి సమస్యపై బీఆర్‌ఎస్ మొదటి నుంచి స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. రైతుకు నీరు అందిస్తే స్వాగతిస్తాం.. నీరు అందించకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం అనేదే తమ పార్టీ వైఖరి అని స్పష్టం చేశారు.రైతుకు సాగునీరు అందితే తమకు సంతోషమేనని, నీళ్లు ఎవరు ఇచ్చారన్నది కాదని.. రైతు పొలానికి నీరు చేరిందా లేదా అన్నదే ప్రధానమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఫోటోలు, ప్రచారాలకే పరిమితం కాకుండా రైతుల ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు.ప్రభుత్వం ఇకపై సాగునీటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, కాలువల చివరి ఆయకట్టు వరకు నీరు సక్రమంగా చేరేలా పర్యవేక్షించాలని అల్వాల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందే వరకు బీఆర్‌ఎస్ రైతుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కేంద్ర విధానాలపై ప్రజా సంఘాల పోరుబాట. కేంద్ర విధానాలపై ప్రజా సంఘాల పోరుబాట.
జమ్మికుంట, టౌన్ ఆగస్టు 10 (తెలంగాణ ముచ్చట్లు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ...
కనపర్తిలో కాంగ్రెస్‌ బలోపేతానికి కొత్త కమిటీ.
అర్చకుల సంక్షేమానికి అంకితమైన నాయకత్వం.
ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన విద్యే ధ్యేయం.
అనుమతుల్లేకుండా ఇసుక తరలింపు.. ఐదు ట్రాక్టర్లపై కేసులు.
సవాల్ విసిరితే బీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కడ?
రైతుకు నీళ్లు ఇస్తే స్వాగతిస్తాం.. ఇవ్వకపోతే ఉద్యమిస్తాం.