రోడ్డు ప్రమాద బాధిత చిన్నారికి అండగా సబ్బాని వెంకట్.
ఆస్పత్రిలో పరామర్శ.. రక్తదానం సమన్వయం, 50 కిలోల బియ్యం అందజేత.
జమ్మికుంట , ఆగస్టు 06 (తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు కొయ్యడ మధు కుమార్తె అక్షర (8)ను సామాజికవేత్త సబ్బాని వెంకట్ బుధవారం పరామర్శించారు.
హస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలానికి చెందిన అక్షర ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదంలో చిన్నారికి కుడి చేయి, కుడి కాలు విరగడంతో ఇప్పటికే ఒక శస్త్రచికిత్స నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా సబ్బాని వెంకట్ ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులను కలిసి చిన్నారికి అత్యుత్తమ వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. చికిత్సకు అవసరమైన బి-నెగెటివ్ రక్తాన్ని అందించేందుకు రక్తదాతలను సమన్వయం చేసి రక్తదానం జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. చిన్నారి పూర్తి ఆరోగ్యంతో కోలుకునే వరకు అవసరమైన వైద్య సహాయం, ఇతర అవసరాల కోసం తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
సబ్బాని వెంకట్ అందించిన ఆర్థిక, మానవతా సహాయానికి కొయ్యడ మధు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


Comments