విద్యార్థుల రాకపోకలకు అడ్డంకిగా మారిన గురుకుల రహదారి.

విద్యార్థుల రాకపోకలకు అడ్డంకిగా మారిన గురుకుల రహదారి.

జమ్మికుంట, ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి దయనీయంగా మారిందని తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల నూతన తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేసిన అనంతరం రహదారిని శాస్త్రీIMG-20260802-WA0037యంగా పునరుద్ధరించకపోవడంతో మొత్తం రోడ్డు బురదమయంగా మారిందని పేర్కొన్నారు.
దీంతో ప్రతిరోజూ గురుకుల పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, స్థానిక ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా రవాణా వాహనాలు సైతం ఈ రహదారిపై ప్రయాణించలేని పరిస్థితి నెలకొనగా, పలువురు వాహనదారుల వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై జమ్మికుంట మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి రహదారిని శాశ్వతంగా మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పొన్నం శిరీష, దీటి రమేష్, అంబాల హరీష్, జంపాల రితేష్, గుండారపు కిరణ్, బండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
  బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ సభలో రావుల వేణుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కితాబు.
స్నేహ బంధానికి ప్రపంచం వందనం.
వేంసూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం.
జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి.
భూ వివాదం ఉద్రిక్తం.. దంపతులపై దాడి జరిగిందని ఆరోపణ.