మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి .
పెద్దమందడి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని వనపర్తి జిల్లా పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. పిల్లల భద్రత అనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి తీసుకోవాల్సిన బాధ్యత అని అన్నారు.పెద్దమందడి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటి వినియోగం వల్ల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించాలని సూచించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. విద్యార్థుల భద్రత, భవిష్యత్తు పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments