వేలేరు రాజరాజేశ్వరి వివో 22వ వార్షిక మహాసభ నిర్వహణ.
వేలేరు, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజరాజేశ్వరి పరస్పర సహాయక పొదుపు సంఘం వీవో 22వ వార్షిక మహాసభ సమావేశం వివో అధ్యక్షురాలు జోష్నా అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో రెండు వివో భవనాలు పూర్తి చేశామని, మిగిలిన రెండు భవనాలకు కూడా త్వరలో నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, ప్రతి వ్యవసాయ భూమిలో పంట కుంట ఏర్పాటు చేసుకోవాలని, ఇంకుడు గుంతకు గ్రామపంచాయతీ ద్వారా రూ.6,500 ప్రోత్సాహకం అందజేస్తున్నట్లు వివరించారు.
అనంతరం మహిళా సంఘం కార్యవర్గ సభ్యులు సర్పంచ్ బిల్లా యాదగిరి ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీఎం అనిత, ఉప సర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి విజయ, సీసీ రమాదేవి, వీవోఏ లక్ష్మి, వివో కార్యవర్గ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.


Comments