భారీ వర్షాన్నీ లెక్కచేయని అన్నపూర్ణ సేవా సమితి.

నిరంతర నిత్యాన్నదాన సేవ.

భారీ వర్షాన్నీ లెక్కచేయని అన్నపూర్ణ సేవా సమితి.

జమ్మికుంట టౌన్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి)లో అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో నిరంతర నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్నపూర్ణ సేవాసమితి సభ్యులు సేవా స్పూర్తితో ముందుకు వచ్చి భక్తులకు, అవసరమైన వారికి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
వాతావరణ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సేవా కార్యక్రమాల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా సమితి సభ్యులు అంకితభావంతో పనిచేయడం పలువురి ప్రశంసలు అందుకుంది. సేవే పరమో ధర్మః అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తున్న అన్నపూర్ణ సేవాసమితి సేవలను భక్తులు, స్థానికులు అభినందించారు.IMG-20260729-WA0013

Tags:

Post Your Comments

Comments

Latest News

వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి. వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి.
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...
గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి.
నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి.
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి : మంత్రి పొంగులేటి.
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సత్కారం.
రాహుల్ గాంధీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు.