ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల పోరాట విజయమే: వొడితల ప్రణవ్.

నీట్ లీకేజీపై కేంద్రం దిగివచ్చింది.. విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పోరాటం ఫలించింది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల పోరాట విజయమే: వొడితల ప్రణవ్.

*ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల పోరాట విజయమే: వొడితల ప్రణవ్*

*నీట్ లీకేజీపై కేంద్రం దిగివచ్చింది.. విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పోరాటం ఫలించింది*

హుజురాబాద్,జులై 25(తెలంగాణ ముచ్చట్లు ):

నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న విద్యార్థుల డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. విద్యార్థులు జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని, వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బలంగా నిలిచారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
నీట్ పరీక్ష లీకేజీ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగించారని తెలిపారు. జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని అన్నారు. విద్యార్థుల సమస్యలను పార్లమెంట్‌లోనూ, ప్రజా వేదికలపైనా రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.
విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం చివరకు అంగీకరించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం విద్యార్థుల పోరాట విజయమని ప్రణవ్ అన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని, ప్రజా ఉద్యమాల ముందు కేంద్రం తలవంచాల్సి వచ్చిందని విమర్శించారు.
గతంలో రైతుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు విద్యార్థుల పోరాటానికీ కేంద్రం స్పందించాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థుల, యువత ప్రయోజనాల కోసం పోరాడుతుందని, భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సూరారంలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి. సూరారంలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.
ఎల్కతుర్తి, జూలై 25 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామ శివారులో రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్‌లో...
నీట్ బాధితులకు కొవ్వొత్తుల నివాళి.
సామాజిక న్యాయం కోసం బహుజన సేన పిలుపు .
శివారాధనతో పుణ్యమయమైన తొలి ఏకాదశి .
ఎల్‌నినో ప్రభావం ...ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి.
తొలి ఏకాదశికి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తజన సందోహం.