దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... 

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.

దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... 

ఖమ్మం బ్యూరో , జూలై- 13(తెలంగాణ ముచ్చట్లు )

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్ లతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు.

కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన ప్రజలు గ్రామ జనాభా అధికంగా ఉన్నందున తమ గ్రామానికి రెండవ రేషన్ దుకాణం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన అమర్లపూడి వసంత రాణి తాను ఇంటర్ చేశానని, ఖాళీగా ఉన్న ప్రీ ప్రైమరీ ఆయా పోస్ట్ కొరకు దరఖాస్తు చేసుకోగా మెరిట్ లిస్ట్ లో పేరు ఉన్నా కూడా పోస్ట్ రాలేదని, ఆయా పోస్ట్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా విద్యాశాఖ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

తల్లాడ మండలం గొల్లగూడెంకు చెందిన జి. సురేష్ తన కుమారుడు గుండ్ల సాత్విక్ కు వైరా బీసీ మహాత్మ జ్యోతి బాపూలే స్కూల్ నందు సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఆర్సిఓ బీసీ సంక్షేమ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన డి.ఉపేంద్ర తనకు బ్లాక్ ఫంగస్ వచ్చి కంటిచూపు పోయిందని తనకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, డీపీఎం, సదరంకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్". 27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్".
ఖమ్మం బ్యూరో,జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మంకేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, ఈ నెల 27వ తేదీన "తెలంగాణ జర్నలిస్టుల ఛలో...
15 రోజుల్లో అర్హులందరికీ అక్రిడిటేషన్ లు.
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... 
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..? అధికారుల వైఫల్యమా..? ఎన్ హెచ్ 765డి జి పై ప్రశ్నల వర్షం.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను గ్రామంలో వేగవంతంగా పూర్తి చేయాలి.
వెల్టూర్‌లో ఓటర్ నమోదు సవరణలపై అవగాహన.
ఆరోగ్యవంతమైన బాల్యానికి నులిపురుగుల నివారణ కీలకం.