స్పష్టమైన భూ రికార్డులే రీ-సర్వే లక్ష్యం.

భూముల రీ-సర్వేపై అవగాహన సదస్సులో అడిషనల్ కలెక్టర్ ఎన్. రవికుమార్.

స్పష్టమైన భూ రికార్డులే రీ-సర్వే లక్ష్యం.

 ఎల్కతుర్తి ,జూలై 3( తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమం ద్వారా స్పష్టమైన, పారదర్శకమైన భూ రికార్డులు రూపొందించడమే ప్రధాన లక్ష్యమని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్. రవికుమార్ అన్నారు. శుక్రవారం ఎల్కతుర్తి మండలంలోని వల్భపూర్ గ్రామంలో నిర్వహించిన భూముల రీ-సర్వేపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీ-సర్వేపై రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, రీ-సర్వే పూర్తయితే భూములకు సంబంధించిన రికార్డులు మరింత స్పష్టంగా, ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భూ వివాదాల పరిష్కారానికి కూడా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రైతులందరూ అధికారులకు పూర్తి సహకారం అందించాలని, సందేహాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.
ఆర్డీఓ వెంకటేష్ మాట్లాడుతూ భూ రీ-సర్వే వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించి, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు.
గ్రామ సర్పంచ్ పొన్నగంటి శ్వేత శ్రీనివాస్ మాట్లాడుతూ తమ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని, గ్రామస్తులు ప్రభుత్వానికి సహకరించి రీ-సర్వేను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రోహిత్ నేత, ఏడీఎస్‌ఎల్‌ఆర్ నూర్ సింగ్, ఎమ్మార్వో ప్రసాదరావు, సర్వేయర్ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ అంబాల అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శైలజ, వార్డు సభ్యులు, రైతులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు రీ-సర్వేకు సంబంధించిన పలు సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా లక్ష్మణ్ నాయక్. వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా లక్ష్మణ్ నాయక్.
వేలేరు, జులై 03 (తెలంగాణ ముచ్చట్లు):  వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన లక్ష్మణ్ నాయక్, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కడియం...
ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనం.
రియల్ ఎస్టేట్ అక్రమాలపై రెరా  కన్నెర్ర .
ప్రజల ఇబ్బందులు గుర్తించి తక్షణ చర్యలు.. నీటిని తొలగించిన కౌన్సిలర్.
జమ్మికుంటలో వింత చర్మవ్యాధులతో వీధి కుక్కల సంచారం.. ప్రజల్లో భయాందోళన.
ఆలయ భూముల పరిరక్షణలో అధికారుల నిర్లక్ష్యం.
స్పష్టమైన భూ రికార్డులే రీ-సర్వే లక్ష్యం.