జమ్ములమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి.

జమ్ములమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి.

పెబ్బేరు,జూన్25(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన జమ్ములమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐపీసీ రాష్ట్ర చైర్మన్, వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన ఆయన, జమ్ములమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.గత రెండు రోజులుగా హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేశ్వరమ్మ–శివరాజు, సహదేవుడు, ఈశ్వర్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఎం.కె. మూర్తి, ఎం. దేవన్న యాదవ్, పాతపల్లి చంద్రశేఖర్, పి. అనిల్, జక్కుల సూరేష్, గోఖరి, కాశన్మ, బాలరాం, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .