57వ డివిజన్ బూత్ స్థాయి ఎన్నికల బాధ్యుల సమావేశం.
హన్మకొండ,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):
57వ డివిజన్ బూత్ స్థాయి ఎన్నికల బాధ్యుల సమావేశం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఎల్. దీప అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. చుక్కయ్య మాట్లాడుతూ, 57వ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల కోసం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి అనేక మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇప్పించామని తెలిపారు.ఇంజినీరింగ్ కాలనీలో ఇంకా ఇండ్ల పట్టాలు అందని ప్రజల కోసం పోరాటం కొనసాగుతోందని, సమ్మయ్య నగర్‌లో కూడా పూర్తి స్థాయిలో పట్టాల సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. అలాగే వాజ్‌పేయి కాలనీలో ఇప్పటికీ ఇంటి నంబర్లు కేటాయించలేదని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఎం నిరంతరం పోరాటం చేస్తోందన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడుతూ 57వ డివిజన్‌లో ఎర్రజెండా నాయకత్వంలో సీపీఎం కార్పొరేటర్ అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్లు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సమావేశంలో 57వ డివిజన్ ఎన్నికల కోఆర్డినేటర్‌గా వి. వీరన్న, సహ కోఆర్డినేటర్లుగా పి. ఉప్పలయ్య, ఎల్. దీపలను ఎన్నుకున్నారు. ఇంజినీరింగ్ కాలనీ బూత్ కన్వీనర్‌గా కె. రవీందర్, సమ్మయ్య నగర్ కన్వీనర్‌గా ఎల్. దీప, గాంధీనగర్ కన్వీనర్‌గా వి. రాజును ఎంపిక చేశారు. అదనంగా 15 మంది బూత్ స్థాయి బాధ్యులను ఎన్నుకుని బాధ్యతలు అప్పగించారు.ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలతో కలిసి ఉద్యమాలు కొనసాగించాలని సమావేశం పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు కె. రవీందర్, జి. అరుణ, బి. లత, అనిత, స్వప్న, రాధిక, వి. రాజు, శాఖ కార్యదర్శి బి. రవి తదితరులు పాల్గొన్నారు.


Comments