రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి.. 

గుర్తించాలని పోలీసుల విజ్ఞప్తి.

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి.. 

ధర్మసాగర్,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):

ధర్మసాగరం మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన గుర్తుతెలియని మహిళను గుర్తించేందుకు పోలీసులు ప్రజల సహకారం కోరుతున్నారు.రాంపూర్ గ్రామ శివారులోని రంగసముద్రం చెరువు సమీపంలో జాతీయ రహదారి-163పై గుర్తుతెలియని వాహనం మహిళను ఢీకొట్టి పరారైంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు, 108 సిబ్బంది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది.మృతురాలు సుమారు 55 సంవత్సరాల వయస్సు, 5.5 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఆకుపచ్చ రంగు చీర, లేత ఆకుపచ్చ రంగు జాకెట్ ధరించి ఉంది. ఆమె భిక్షాటన చేసే మహిళగా కనిపిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ మహిళను ఎవరైనా గుర్తించినా, ఆమె కుటుంబ సభ్యులు లేదా బంధువుల వివరాలు తెలిసినా వెంటనే ఈ నంబర్లకు ఫోన్ చేసి 8712685010, 8712675127 ధర్మసాగర్ పోలీసులను సంప్రదించాలని కోరారు. మృతదేహం ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచి ఉంచినట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .