హనుమకొండకు బదిలీ నేపథ్యంలో వెటర్నరీ డాక్టర్ మాలతికి ఆత్మీయ వీడ్కోలు.

8 ఏళ్ల సేవలకు గుర్తింపుగా ఘన సన్మానం.

హనుమకొండకు బదిలీ నేపథ్యంలో వెటర్నరీ డాక్టర్ మాలతికి ఆత్మీయ వీడ్కోలు.

భీమదేవరపల్లి, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

 హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని పశువైద్యశాలలో గత 8 సంవత్సరాలుగా పశువైద్య అధికారిణిగా సేవలందించిన డాక్టర్ మాలతి హనుమకొండకు బదిలీ కావడంతో ఆమెకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొప్పూరు గ్రామ సర్పంచ్ గద్ద కుమారస్వామి, ఉపసర్పంచ్ మిరియాల రాణిరాజు, రైతులు, ప్రజాప్రతినిధులు కలిసి డాక్టర్ మాలతిని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. పశుసంవర్ధక రంగ అభివృద్ధికి ఆమె అందించిన సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

డాక్టర్ మాలతి మాట్లాడుతూ, భీమదేవరపల్లి మండల రైతులు, ప్రజలు తనకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పనిచేసిన కాలం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు, పశుపోషకులు, గ్రామ పెద్దలు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .