ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం .

వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు.

ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం .

పెద్దమందడి,మే03(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ న్యూ ఎస్సీ కాలనీకి చెందిన దయ్యాల పద్మ(కీర్తిశేషులు దయ్యాల నాగేష్) నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. దయ్యాల పద్మ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ నాయకులు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు.దయ్యాల పద్మ నూతన గృహ నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం జరుపుకోవడం ఆనందదాయకమని, ఆమె కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.గ్రామ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామం మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, వార్డు సభ్యులు నాగభూషణ్, మద్దూర్ నరసింహ, గుండెల ఆంజనేయులు, మద్దూర్ వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు, శ్యాంసుందర్, కుటుంబ సభ్యులు సురేష్, భరత్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .