జమ్మికుంటలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

అర్హులకు ఆర్థిక భరోసా.

జమ్మికుంటలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

జమ్మికుంట టౌన్ మే 03 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణంలో ప్రజా సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. హుజూరాబాద్ శాసనసభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారితో కలిసి మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా చెక్కులను అందజేసి వారికి ఆర్థిక భరోసా కల్పించారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు.
ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ, అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్న ప్రజా ప్రతినిధుల సేవలను స్థానికులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు పొనగంటి రాము, ఫిరోజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, నాయకులు లక్నగంటి సంపత్, పతకాల రమేష్, పూర్ణచందర్, దుర్గప్రసాద్, సలీం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .