మార్క్ఫెడ్ ఆలస్యం… మక్కల కాపలాలో రైతులు.
Views: 9
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
మార్క్ఫెడ్ ద్వారా రైతుల వద్ద నుంచి మక్కల కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ, సకాలంలో తరలింపులు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని జమ్మికుంట మాజీ జెడ్పిటిసి డాక్టర్ శ్రీరాం శ్యామ్ పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
ప్రభుత్వం క్వింటాకు రూ.2400 చొప్పున మక్కలను కొనుగోలు చేస్తున్నప్పటికీ, కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాముల నుంచి సమయానికి దిగుమతి చేయకపోవడం వల్ల గోదాముల్లో మక్కల రాశులు పేరుకుపోతున్నాయని తెలిపారు. జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాల్లో ఏర్పాటు చేసిన గోదాములు ఇప్పటికే నిండిపోతుండగా, రైతులు తమ పంటను నిల్వ ఉంచడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లాతో పాటు హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన రైతుల మక్కలను కూడా ఇదే గోదాములకు కేటాయించడం వల్ల ఒత్తిడి మరింత పెరిగిందన్నారు.
మక్కల దిగుమతికి అధికారులు ఒకటి రెండు రోజులు ఆలస్యం చేయడం రైతులకు మరింత భారంగా మారుతోందని పేర్కొన్నారు. తక్షణమే స్పందించి గోదాముల నుంచి మక్కలను వేగంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే పెరుగుతున్న నిల్వలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని గోదాములు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments