రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.!

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.!

- తక్కువ యూరియా వినియోగం.
- సేంద్రియ సాగుపై అవగాహన.
 
సత్తుపల్లి, ఏప్రిల్ 28(తెలంగాణ ముచ్చట్లు): 
 
గ్రామీణ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం మంగళవారం కాకర్లపల్లి రైతువేదికలో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట అసోసియేట్ డీన్ డా. జె. హేమంత కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది. ఉద్యాన విభాగం ప్రొఫెసర్ డా. ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తక్కువ యూరియా వినియోగం వల్ల ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. అధిక రసాయనాల వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఆయిల్ పామ్‌తో పాటు ఇతర ఉద్యాన పంటల సాగు, మార్కెటింగ్‌పై సూచనలు ఇచ్చారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. డా. ఆర్. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన నేల, నీరు, పర్యావరణం అందించడం రైతుల బాధ్యత అని అన్నారు. మండల వ్యవసాయ అధికారి వై. శ్రీనివాస్ రావు, పశువైద్య అధికారి డా. శశిదీప్, ఉద్యాన శాఖ విస్తరణ అధికారి రాజేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్. అనూష, సర్పంచ్ మారేశ్వరరావు, ఉప సర్పంచ్ రాధాకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.IMG-20260428-WA0060
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .