తెలంగాణ ప్రజల కోసం బిఆర్ఎస్ నిరంతర పోరాటం

మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్ 

తెలంగాణ ప్రజల కోసం బిఆర్ఎస్ నిరంతర పోరాటం

ఎల్కతుర్తి, ఏప్రిల్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
 
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉందని మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్కతుర్తి మండలంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పిట్టల మహేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన త్యాగాలు, పోరాటం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. తెలంగాణపై జరిగిన వివక్షను ఎదుర్కొని, సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అండగా నిలవడంలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, మాజీ ఎంపీపీ మేకల స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తంగేడ మహేందర్, మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేష్, మాజీ మండల అధ్యక్షులు యేల్తూరి స్వామి, పోరెడ్డి రవీందర్ రెడ్డి, కడారి రాజు, గొల్లె మహేందర్, గుండేటి సతీష్, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, సాతూరి శంకర్, మదార్, మునిగడప లావణ్య, శేషగిరి, అంబాల రాజ్ కుమార్, బొంకూరి రజిత, అంబాల అనిల్, మేకల బాబు తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News