అల్వాల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి .

వెంకట్ రెడ్డి అల్వాల గ్రామ రైతు .

అల్వాల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి .

పెద్దమందడి,ఏప్రిల్(25తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన రైతు వెంకట్ రెడ్డి  వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమ పంటను ఎక్కువకాలం నిల్వ ఉంచడం కష్టమవుతోందని రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు.రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే పంట కోత పూర్తయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. దీంతో దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .