వనపర్తిలో ఘనంగా భగీరథ మహర్షి జయంతి.
Views: 9
On
వనపర్తి,ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు భగీరథ మహర్షి అని నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి కొనియాడారు.గురువారం భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని వనపర్తిలోని భగీరథ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా సగర సంఘం అధ్యక్షుడు మోడల తిరుపతయ్య సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఐడీఓసీ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లోనూ పాల్గొని మరలా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ..కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధించే వారిని భగీరథునితో పోలుస్తారని తెలిపారు. కఠోర శ్రమతో ఏ లక్ష్యాన్నైనా సాధించగలిగితే దానిని భగీరథ ప్రయత్నం గా పేర్కొంటారని అన్నారు.
ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ, భగీరథ మహర్షి పరోపకారం, సహనం, దీక్షకు ప్రతిరూపమని, ఎంతటి కష్టాన్నైనా లెక్కచేయకుండా లక్ష్యాన్ని చేరుకున్న మహాజ్ఞాని అని వివరించారు.జయంతి సందర్భంగా సగర సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా సగర సంఘం అధ్యక్షుడు మోడల తిరుపతయ్య సాగర్ కూడా మాట్లాడుతూ, భగీరథ మహర్షి చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రుడు సాగర్, కోశాధికారి గుంటి సత్యం సాగర్, మురళి సాగర్ (19వ వార్డ్ కౌన్సిలర్), పల్లె సత్యనారాయణ సాగర్, పెద్ద నాగులు సాగర్, విష్ణు సాగర్, ఆర్కే రవి సాగర్ తదితరులు, ప్రజా సంఘాల నాయకులు, కౌన్సిలర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments