సిర్సపల్లి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీతో వొడితల ప్రణవ్ భేటీ

సిర్సపల్లి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీతో వొడితల ప్రణవ్ భేటీ

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
 
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని సిర్సపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హైదరాబాద్‌లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవిని కలిశారు.
ఈ సందర్భంగా ప్లాంట్‌ను వేరే ప్రాంతానికి తరలించే సాధ్యాసాధ్యాలపై కూలంకషంగా చర్చించారు. ప్లాంట్‌ను స్థానాంతరం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ప్లాంట్ హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండటం వల్ల ప్రజలకు కలిగే అనర్థాలను ప్రణవ్ వివరించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ విషయమై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి సమస్యను వివరించనున్నట్లు వొడితల ప్రణవ్ తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .