యువత ముందుకు వస్తేనే రోడ్డు భద్రత సాధ్యం.
గోపాల్పూర్ సర్పంచ్ కర్రే లక్ష్మి బిక్షపతి
Views: 9
On
ఎల్కతుర్తి ,ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామంలో రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ముఖ్యంగా యువత ముందుకు రావాలని సర్పంచ్ లక్ష్మి పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మి గారి అధ్యక్షతన రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మారుపాక సందీప్, కార్యదర్శి గణపతి, వార్డ్ సభ్యులు, గ్రామ అభివృద్ధి అధికారి బుచ్చిలింగం, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, గ్రామ పరిపాలనా సహాయకులు మరియు యువజన సభ్యులు పాల్గొన్నారు.
సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ యువత బాధ్యతగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, వేగ పరిమితులను పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని ఆమె స్పష్టం చేశారు. గ్రామంలో ప్రమాదాలకు కారణమయ్యే ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఉపసర్పంచ్ మారుపాక సందీప్ మాట్లాడుతూ గ్రామంలో కీలక కూడళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, పాఠశాలల సమీపంలో వేగ నియంత్రణ చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యదర్శి గణపతి మాట్లాడుతూ రోడ్డు భద్రత కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షణ నిర్వహించి అవసరమైన సూచనలు చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామంలో రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు వరుసగా సర్పంచ్, వి. సమ్మయ్య, సంపతీరెడ్డి, కె. అన్నపూర్ణ (అంగన్వాడీ టీచర్), జి. స్వరూప (గ్రామ పరిపాలనా సహాయకుడు), కె. సుమలత (గ్రామ పరిపాలనా సహాయకుడు), జి. స్వరూప (ఆశా వర్కర్), బుచ్చిరాములు (గ్రామ అభివృద్ధి అధికారి), యెల్తూరి రాజేందర్, మాచర్ల మనోజ్ ఉన్నారు.
ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని, “సురక్షితంగా
చేరండి – ప్రాణాలను కాపాడండి” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
చేరండి – ప్రాణాలను కాపాడండి” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments