అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు.
మల్కాజిగిరి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మల్కాజిగిరి పరిధిలోని ఆనంద్‌బాగ్ మరియు నేరేడ్మెట్ జెజె నగర్ ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో స్థానికంగా కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు చేసిన సేవలను కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే సమాజంలో ఐక్యత, సౌహార్దం పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో మల్కాజిగిరి బీజేపీ సీనియర్ నాయకులు కొతపల్లి ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆదిత్యతో పాటు శ్యామ్, శర్మ, ప్రవేశ్, సాయి, అకరం సాయి, నరసింహ మరియు ఇతర పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments