తక్కువ ధరకు బంగారం అంటూ మోసం ప్రయత్నం.

తక్కువ ధరకు బంగారం అంటూ మోసం ప్రయత్నం.

_నాగారం మాజీ వార్డ్ సభ్యుడు సాయినాథ్ గౌడ్‌కు ఫోన్ కాల్ 

– అప్రమత్తం చేసిన పోలీసులకు సమాచారం

నాగారం, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం డివిజన్‌లో తక్కువ ధరకే బంగారం అందిస్తామని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నాగారం మాజీ వార్డ్ సభ్యుడు చిన్నం రాజు సాయినాథ్ గౌడ్‌ను లక్ష్యంగా చేసుకుని అగంతకులు ఫోన్ కాల్ చేశారు. సోమవారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో 9581689660 నంబర్ నుండి ఫోన్ చేసి తక్కువ ధరలో బంగారం ఇస్తామని నమ్మబలికే ప్రయత్నం చేశారు.అంతే కాకుండా 9676470306 వాట్సాప్ నంబర్ ద్వారా బంగారం ఉన్నట్లు చూపిస్తూ వీడియోను పంపించారు.అయితే ఈ వ్యవహారం అనుమానాస్పదంగా భావించిన సాయినాథ్ గౌడ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అలాగే అగంతకుల కాల్ రికార్డులు, వీడియోలను పత్రికలు మరియు ప్రసార మాధ్యమాలకు పంపించి ప్రజలను అప్రమత్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ ధరలకు బంగారం, లోన్లు, లాటరీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించుకోవాలంటే అపరిచితుల మాటలకు లోబడకూడదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సాయినాథ్ గౌడ్ ప్రజలను కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .